Priyaanka Chopra: ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టిన ప్రియాంకా చోప్రా... అధికారుల నోటీసులు!

  • పలు విలువైన వస్తువులపై పన్ను ఎగవేత
  • అవన్నీ తనకు బహుమతులని వివరణ
  • అయినా పన్ను కట్టాల్సిందేనని నోటీసులు

ప్రభుత్వానికి లగ్జరీ టాక్స్ ఎగ్గొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా మరిన్ని చిక్కుల్లో పడింది. ఆమె వద్ద ఉన్న లగ్జరీ వాచ్, లగ్జరీ సెడాన్ కార్లపై పన్నులను చెల్లించాల్సిందేనని ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపగా, అవి తనకు గతంలో వచ్చిన బహుమతులని ఆమె ఇచ్చిన వివరణను అధికారులు తిరస్కరించారు. రూ. 40 లక్షల విలువైన ఎల్వీఎంహెచ్ - ట్యాగ్ వాచ్, రూ. 27 లక్షల ఖరీదైన టయోటా ప్రిస్ కారు తనకు బహుమతిగా వచ్చాయని ఆమె వెల్లడించగా, ఆదాయపు పన్ను సెక్షన్ 28 (4) ప్రకారం వాటిపై పన్ను చెల్లించాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ నెల 16వ తేదీన ఐటీ అధికారుల నుంచి తాజా నోటీసులు ఆమెకు వెళ్లినట్టు తెలుస్తోంది. 2006-07 ఆర్థిక సంవత్సరం నుంచి ఆమె పన్నులను ఎగ్గొడుతున్నట్టు తెలుస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్ టెయిన్ మెంట్ నుంచి రూ. 17.06 లక్షల విలువైన ఆభరణాలను ఆమె బహుమతిగా పొందిందని, ఓ పెంట్ హౌస్ కూడా ఆమెకు గిఫ్ట్ గా లభించిందని, దానిని అద్దెకు ఇచ్చిన ప్రియాంక దానిపై పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని పొందుతోందని, వీటిపైనా పన్నులు చెల్లించాల్సిందేనని అధికారులు అంటున్నారు. 2007-08లో ఆమె రూ. 50 లక్షల ఆదాయానికి లెక్కలు చూపలేదని, 2008-09లో అద్దె రూపంలో రూ. 6 లక్షలు పొంది లెక్కల్లో కలపలేదని తేల్చిన అధికారులు, ఆమెపై చర్యలకు సిద్ధమవుతున్నారు.

More Telugu News