rangasthalamteaser: ఈ సీజన్లో నేను ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రం ఇదే!: రాజమౌళి

  • ‘రంగస్థలం’ టీజర్ పై రాజమౌళి ప్రశంసలు 
  • చిట్టిబాబు పాత్రలో చరణ్
  • మార్చి 30న విడుదల

1985 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథా చిత్రంగా సుకుమార్ ‘రంగస్థలం’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి  సంబంధించిన టీజర్ నిన్ననే విడుదలై మంచి స్పందనను దక్కించుకుంది. అనేక మంది సినీ సెలబ్రిటీలు, ప్రేక్షకులు, అభిమానులు ఈ టీజర్ పై ప్రశంసల జల్లులు కురిపించారు. చరణ్ తో మంచి మిత్రత్వం కలిగిన దర్శకధీరుడు రాజమౌళి అయితే టీజర్ చాలా బాగుందని, ఈ సీజన్లో తాను ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రం ఇదేనని స్పందించారు.

ఈ సినిమాలో రామ్ చరణ్... చిట్టిబాబు పాత్రలో నటిస్తుండగా ఆయన సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. యాంకర్ అన‌సూయ ఈ మూవీలో రంగ‌మ్మ‌త్త‌గా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News