రాజ్‌పుత్ క‌ర్ణిసేనల ఎటాక్: ప్రాణభయంతో బస్సులో సీట్ల పక్కన దాక్కున్న విద్యార్థులు.. వీడియో చూడండి!

  • గుర్గావ్‌లో ఘటన
  • 'పద్మావత్' విడుదల నేపథ్యంలో రాజ్‌పుత్‌ల ఆందోళన
  • స్కూల్ బస్‌పై దాడి 
దేశ రాజ‌ధాని ఢిల్లీకి ద‌గ్గ‌ర‌లోని గుర్గావ్‌లో స్కూల్ చిన్నారులకు భ‌యాన‌క అనుభ‌వం ఎదురైంది. బాలీవుడ్ సినిమా ప‌ద్మావ‌త్ ఎన్నో వివాదాలను ఎదుర్కుని చివ‌ర‌కు రేపు విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాజ్‌పుత్ క‌ర్ణిసేనల ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి. గుర్గావ్‌లో ఓ స్కూలు బ‌స్ వెళుతుండ‌గా దానిపై ఆందోళ‌నకారులు దాడి చేశారు. బ‌స్సు అద్దాల‌న్నీ ప‌గిలిపోయాయి. దీంతో చిన్నారులు అంద‌రూ బ‌స్సు సీట్ల కింద దాక్కుని ప్రాణ భ‌యంతో వ‌ణికిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.     
Go Back to Shorts
school
bus
targeted
Padmaavat
Deepika Padukone

More Telugu News