అశ్లీల చిత్రాలు పంపిన యువకుడిని చంపినంత పని చేసిన యువతి!

  • స్మార్ట్ ఫోన్ ద్వారా అశ్లీల చిత్రాలు పంపిన యువకుడు
  • గొంతు నొక్కి ఊపిరాడకుండా చేసిన యువతి
  • హర్యానాలో ఘటన
ఒక యువకుడు అశ్లీల చిత్రాలను స్మార్ట్ ఫోన్ ద్వారా ఓ యువతికి పంపగా, ఆమె అతన్ని చంపినంత పని చేసింది. ఈ ఘటన హర్యానా పరిధిలోని కైథల్ లో జరిగింది. నలుగురి ముందూ నడిరోడ్డుపై యువకుడిని ఉతికి ఆరేసిన ఆ యువతి, అతని గొంతు నొక్కేసి ఊపిరి ఆడకుండా చేసింది.

తొలుత పెద్దగా తిట్ల దండకానికి దిగిన ఆమె, ఆపై అతనిపై దాడికి దిగింది. నాకు ఇటువంటి చిత్రాలను పంపుతావా? అని కొట్టింది. ఆమెతో పాటు తోడుగా వచ్చిన మరో మహిళ కూడా సదరు ప్రబుద్ధుడిపై దాడి చేసింది. ఆపై చుట్టుపక్కల వాళ్లు వచ్చి, మరో నాలుగు వాయించి, అతడిని పోలీసులకు అప్పగించారు. చివరికి పోలీసు స్టేషన్ లో ఇరు వర్గాలూ రాజీకి రావడం గమనార్హం. దీంతో ఎటువంటి కేసునూ నమోదు చేయలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Go Back to Shorts
Haryana
Smart Phones
Photos

More Telugu News