rape victim: త‌న‌కు న్యాయం చేయాలంటూ పీఎం, సీఎంల‌కు ర‌క్తంతో లేఖ రాసిన అత్యాచార బాధితురాలు

  • పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వ్యాఖ్య‌
  • త‌న‌ను కేసు వెన‌క్కితీసుకోవాల‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌ని వెల్ల‌డి
  • న్యాయం జ‌ర‌గ‌క‌పోతే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని హెచ్చ‌రిక‌


త‌నకు జ‌రిగిన అన్యాయానికి స‌రైన న్యాయం చేయాల‌ని కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల‌కు ఓ అత్యాచార బాధితురాలు ర‌క్తంతో లేఖ రాసి పంపింది. తన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన వారికి శిక్ష ప‌డేలా చేయాల‌ని ఆమె లేఖ‌లో వేడుకుంది.

`ఫిర్యాదు చేసినప్ప‌టికీ పోలీసులు ఎలాంటి చ‌ర్య తీసుకోవ‌డం లేదు. నిందితుల‌కు పెద్ద పెద్ద వ్య‌క్తుల‌తో సంబంధాలు ఉండ‌టం వ‌ల్ల వారు మా బాధ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. అంతేకాకుండా కేసు వెన‌క్కి తీసుకోవాల‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు` అని ఆ బాధితురాలు లేఖ‌లో పేర్కొంది.

త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోతే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని ఆమె పేర్కొంది. గ‌తేడాది మార్చి 24న దివ్యా పాండే, అంకిత్ వ‌ర్మ‌లు త‌న కూతురిని రేప్ చేశారంటూ బాధితురాలి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అప్ప‌టి నుంచి ఈ కేసులో ఎలాంటి పురోగ‌తి లేక‌పోగా, నిందితుల‌తో క‌లిసి పోలీసులు కూడా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నార‌ని బాధితురాలి తండ్రి ఆరోపించాడు.

More Telugu News