hollywood: హాలీవుడ్ చిత్రంలో న‌టిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌ సోద‌రుడు అమ‌న్‌

  • 'సెడిష‌న్' అనే చిత్రంలో సీఐఏ ఏజెంట్ పాత్ర‌
  • ల‌ఘు చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన అమ‌న్‌
  • త్వ‌ర‌లో తెలుగులో కూడా న‌టించే అవ‌కాశం

సోద‌రి ర‌కుల్ ప్రీత్ సింగ్ భార‌తీయ చిత్రసీమ‌లో రాణిస్తుంటే.. సోద‌రుడు అమ‌న్ సింగ్ ఏకంగా హాలీవుడ్ మీదే క‌న్నేశాడు. అంతేకాదు.. ఇప్ప‌టికే ఓ ఆంగ్ల చిత్రంలో కూడా న‌టిస్తున్నాడు. 'సెడిష‌న్' అనే ఆంగ్ల చిత్రంలో ర‌కుల్ సోద‌రుడు అమ‌న్ సీఐఏ ఏజెంట్ పాత్ర‌లో నటిస్తున్నాడ‌ట‌. గతేడాది 'రాక్‌ ఎన్‌ రోల్‌' అనే లఘు చిత్రంతో అమన్‌ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ ల‌ఘుచిత్రం ప్ర‌మోష‌న్ కోసం ర‌కుల్ చాలా స‌హాయం చేసింది.

ఇక అమ‌న్ న‌టిస్తున్న ఆంగ్ల చిత్రం హిందీలో కూడా విడుద‌ల‌వ‌నుంది. పలువురు భారతీయ నటులు కూడా ఇందులో క‌నిపించ‌బోతున్నట్లు స‌మాచారం. సమ్మర్‌ బోధి నిక్స్‌, జోయెల్‌ మరాక్కోలు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియాలో విడుదల కాబోతోంది. ఎలాగూ న‌ట‌న‌లో ప్ర‌వేశం ఉంది కాబ‌ట్టి త్వరలో తెలుగులో కూడా అమన్‌ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

More Telugu News