Pawan Kalyan: పవన్ కల్యాణ్ అభిమానులు ఈ ఆవేశం ఆపుకుంటే ‘జనసేన’ బాగుపడుతుంది: ప్రొఫెసర్ నాగేశ్వర్ హితవు

  • ‘లాబీయింగ్’ అనే పదంపై పవన్ అభిమాని అభ్యంతరం 
  • నాగేశ్వర్ మాట్లాడుతుండగా అడ్డుతగిలిన అభిమాని
  • ఈ ఆవేశం తగ్గించుకోవాలని హితవు పలికిన నాగేశ్వర్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ పొలిటికల్ లాబీయింగ్ లో ఉన్నారని, ఏదైనా సమస్యను గుర్తించి.. చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి, ఆయన ద్వారా పరిష్కారం చేయిస్తున్నారని సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ‘ఏబీఎన్’ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ‘లాబీయింగ్’ అనే పదాన్ని నాగేశ్వర్ ఉపయోగించడంపై చర్చలో పాల్గొన్న పవన్ అభిమాని ఒకరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన నాగేశ్వర్..‘పవన్ కల్యాణ్ అభిమానులు ఈ ఆవేశం ఆపుకుంటే ‘జనసేన’ బాగుపడుతుంది. ‘పవన్ కల్యాణ్ పై దోమ వాలినా దానిపై అణుబాంబు వేసి చంపుతాను’, ‘ఈగ వాలితే దానిపై రివాల్వర్ పేలుస్తాను’ అనే లక్షణం వల్ల పవన్ కల్యాణ్ కు నష్టం తప్ప, నాకేమీ నష్టం లేదు..నా కొంప మునిగేదేమీ లేదు. ఈ ధోరణి మంచిది కాదని చెబుతున్నాను. ‘లాబీయింగ్’ అనేది చెడ్డ పదమేమీ కాదు. అమెరికాలో అయితే లాబీయిస్టులు అనే ప్రత్యేక ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది’ అని నాగేశ్వర్ అన్నారు.

More Telugu News