seetharam yechuri: పార్టీ పదవికి రాజీనామాకు సిద్ధపడ్డ సీతారాం ఏచూరి?

  • కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుందామన్న ఏచూరి
  • తిరస్కరించిన కేంద్ర కమిటీ
  • మనస్థాపానికి గురైన ఏచూరి

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సొంత పార్టీ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయమై పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించడంలో ఆయన మరోసారి విఫలమయ్యారు. ఏచూరి ప్రతిపాదనలను కేంద్ర కమిటీ తోసిపుచ్చడంతో, ఆయన రాజీనామాకు సిద్ధమైనట్టు సమాచారం.

2019లో బీజేపీ ఓటమే పార్టీ ప్రధాన లక్ష్యమని ఆరు నెలల క్రితం సీపీఎం తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఓటు బ్యాంకు పెంచుకునేందుకు బీజేపీ వ్యతిరేక కూటమితో చేతులు కలపాలని ఏచూరి ఓ ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనను కేంద్ర కమిటీ తిరస్కరించింది. కాంగ్రెస్ పార్టీవి మోసపూరిత రాజకీయాలని... ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని సీనియర్ నేత ప్రకాశ్ కారత్ అన్నారు.

శనివారం వరకు ఈ వ్యవహారంపై ఏకాభిప్రాయం రాలేదు. దీంతో నిన్న ఓటింగ్ నిర్వహించారు. ప్రస్తుతం సీపీఎం కేంద్ర కమిటీలో 91 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో కారత్ కు 55 మంది ఓటు వేయగా, 31 మంది ఏచూరి ప్రతిపాదనకు మద్దతు పలికారు. దీంతో, ఏచూరి మనస్తాపానికి గురయ్యారు. రాజీనామాకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం ఆయనను సముదాయించే పనిలో సీనియర్ నేతలు ఉన్నారు.

More Telugu News