Jammu And Kashmir: మనకు జరుగుతున్న అన్యాయం విషయంలో కేంద్రాన్ని నిలదీసే నేతలే లేరా?: హీరో శివాజీ

  • హోదా కోసం కోర్టుకు వెళ్తాననడం ఏపీ ప్రభుత్వం చేతగాని తనం
  • ‘కేంద్రం’ నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటకు రావాలి
  • ప్రత్యేక హోదాపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి : శివాజీ

ఏపీకి జరుగుతున్న అన్యాయం విషయమై కేంద్రాన్ని నిలదీసే నేతలే లేరా? అంటూ హీరో శివాజీ ఆవేశంగా ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగు ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఏపీ ప్రభుత్వం భయపడుతోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయమై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్తాననడం చేతగాని తనమని, మనకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడే నేతలే లేకపోవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటకు రావాలని, ప్రత్యేక హోదాపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, దానిని ఢిల్లీకి తీసుకెళ్లాలని శివాజీ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే 2019లో బీజేపీదే అధికారమని అన్నారు. అంతకుముందు సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ, విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్ పై బీజేపీ నేతలు కేంద్రానికి లేఖలు రాయాలని అన్నారు. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

More Telugu News