దావోస్ లో చంద్రబాబు టైట్ షెడ్యూల్, వివరాలు.. ఏపీ లాంజ్ ను దర్శించనున్న మోదీ

Sun, Jan 21, 2018, 01:26 PM
 • 25 వరకు దావోస్ లో పర్యటన
 • నాలుగు రోజులపాటు ఫుల్ బిజీ
 • ఏపీ లాంజ్ ను దర్శించనున్న మోదీ
దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బయల్దేరుతున్నారు. రేపట్నుంచి 25వ తేదీ వరకు ఆయన దావోస్ లో గడపనున్నారు. ఈ సందర్భంగా ఆయన షెడ్యూల్ చాలా బిజీగా ఉండబోతోంది. షెడ్యూల్ వివరాలు ఇవే...
22వ తేదీ:
 • సదస్సు ప్రారంభోత్సవ సమావేశంలో ప్రసంగం
 • ఆ తర్వాత క్రిస్టల్ అవార్డుల వేడుకలో పాల్గొంటారు
 • డీఐపీపీ ఏర్పాటు చేసే ఇండియా రిసెప్షన్ కు హాజరు
23వ తేదీ:
 • ఏపీ లాంజ్ లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు
 • మధ్యాహ్నం నుంచి స్థానిక ప్రముఖులు, అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో వరుస భేటీలు
 • ఇదే రోజు ప్రధాని మోదీ ఏపీ లాంజ్ ను సందర్శిస్తారు
 • ఇండియా లాంజ్ లో ఏపీ-జపాన్ భోజన సమావేశంలో సీఎం పాల్గొంటారు
24వ తేదీ:
 • మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ బెల్విడర్ లో లంచ్ ఆన్ సమావేశం
 • టెక్నాలజీస్ ఫర్ టుమారో అనే అంశంపై టెక్నాలజీలో వినూత్న ఆవిష్కర్తలతో చర్చాగోష్ఠి 
 • ఆ తర్వాత సీఐఐ సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం
 • బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ ఛైర్మన్ షేక్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఏర్పాటు చేసిన డిన్నర్ సమావేశానికి హాజరు
25వ తేదీ:
 • వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు
 • ఫ్రాన్ హోఫర్-ఏపీఈడీబీ  మధ్య ఎంఓయూ
 • హిటాచీతో ఎంవోయూ
 • జ్యూరిచ్ తో సిస్టర్ సిటీ ఒప్పందం
 • ట్రాన్స్ ఫార్మింగ్ అగ్రికల్చర్, న్యూ అగ్రికల్చర్, టెక్నాలజీస్ ఆఫ్ టుమారో అంశాలపై జరిగే సెషన్స్ లో ప్రసంగం
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha