america: రష్యా, చైనాలతో యుద్ధానికి సన్నద్ధంగా ఉండండి: అమెరికా

  • రష్యా, చైనాల నుంచి బెదిరింపులు వస్తున్నాయి
  • కొన్నేళ్లుగా మన శక్తి తగ్గుతూ వస్తోంది
  • సైనిక శక్తిని మరింత పటిష్టం చేయాలి

రష్యా, చైనాల నుంచి వరుసగా బెదిరింపులు వస్తున్నాయని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మట్టిస్ తెలిపారు. ఈ నేపథ్యంలో యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని తమ బలగాలకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికా సైనిక సామర్థ్యంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఇప్పటికీ అమెరికా సైన్యం బలమైనదేనని... గగనతలం, ఉపరితలం, అంతరిక్షం, సైబర్ స్పేస్ లలో మన ఆధిపత్యం ఉందని... అయితే నానాటికీ అది కొంచెం తగ్గుతూ వస్తోందని చెప్పారు. గత కొన్నేళ్లుగా సైన్యానికి సరైన బడ్జెట్ కేటాయింపులు జరగని కారణంగా యూఎస్ ఆర్మీ ఇబ్బందులు పడుతోందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. సైనిక శక్తిని మరోసారి పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరోవైపు, కొత్త రక్షణ వ్యూహాలను సిద్ధం చేసే పనిలో పెంటగాన్ ఉంది.

More Telugu News