padmavaat: వైర‌ల్‌గా మారిన ప‌ద్మావ‌త్ 'ఘూమ‌ర్‌' పాట‌... కొత్త మార్పుల‌తో పాట‌ను తిరిగి విడుద‌ల చేసిన నిర్మాత‌లు

  • దీపికా ప‌దుకునే న‌డుము కనిపించ‌కుండా గ్రాఫిక్స్‌తో మార్పులు
  • కొత్త పాట‌కు 90 ల‌క్ష‌ల వీక్ష‌ణ‌లు
  • పాత పాట‌తో క‌లిపి పోల్చి చూస్తున్న నెటిజ‌న్లు

'ప‌ద్మావ‌త్' చిత్రం విడుద‌ల కోసం సెన్సార్ బోర్డు వారు చెప్పిన స‌వ‌ర‌ణ‌ల్లో 'ఘూమ‌ర్' పాట‌కు సంబంధించిన స‌వ‌ర‌ణ ఒక‌టి ఉంది. ఆ పాట చిత్రీక‌ర‌ణ‌లో ప‌ద్మావ‌తి పాత్ర‌లో న‌టించిన దీపికా ప‌దుకునే న‌డుమును చూపించిన స‌న్నివేశాల‌ను తొల‌గించాల‌ని సీబీఎఫ్‌సీ కోరింద‌ట‌. అయితే ఆ సీన్లు తొల‌గిస్తే పాట కోసం రాజ‌స్థానీ ఘూమ‌ర్ నృత్యంలో చేసిన కొరియోగ్ర‌ఫీ దెబ్బ‌తింటుంద‌ని న‌డుమును గ్రాఫిక్స్ ద్వారా క‌ప్పివేస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు చెప్పార‌ట‌. దానికి సీబీఎఫ్‌సీ అంగీక‌రించ‌డంతో ఆయా మార్పులు చేసి పాట వీడియోను తిరిగి విడుద‌ల చేశారు నిర్మాత‌లు.

ఇప్పుడు ఆ కొత్త‌గా విడుద‌ల చేసిన పాట ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. పాత పాట వీడియో కూడా యూట్యూబ్‌లో అందుబాటులో ఉండ‌టంతో ఈ రెండు వీడియోల‌ను నెటిజ‌న్లు పోల్చి చూస్తున్నారు. అలా పోల్చి చూస్తేనే గానీ తేడాల‌ను క‌నిపెట్ట‌లేనంత‌గా ఈ కొత్త వీడియో ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి మ‌రి!
(మొద‌టిది కొత్త వెర్ష‌న్‌.. రెండోది పాత వెర్ష‌న్‌)



More Telugu News