Pakistan: ఐరాస భద్రతామండలిలో పాకిస్థాన్‌ తీరును దుయ్యబట్టిన భారత్‌

  • ఉగ్రవాదులకు ఊతమిస్తున్న వాళ్లు తమ బుద్ధిని మార్చుకోవాలి
  • ఉగ్రవాదం కారణంగా ఆప్ఘనిస్థాన్‌లో శాంతి, స్థిరత్వానికి ప్రమాదం
  • సరిహద్దుల్లో ఉగ్రవాదం వల్ల ఆప్ఘనిస్థాన్‌లో వృద్ధి రేటు తగ్గిపోయింది

ఉగ్రవాదులకు అండగా నిలిచిన వాళ్లు తమ బుద్ధిని మార్చుకోవాలని పాకిస్థాన్‌పై ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ విమ‌ర్శ‌లు చేసింది. ఐరాస భద్రతామండలి ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న భారత శాశ్వత ప్రతినిధి సయీద్‌ అక్బరుద్దీన్ మాట్లాడుతూ... ఉగ్రవాదం కారణంగా ఆప్ఘనిస్థాన్‌లో శాంతి, స్థిరత్వానికి ప్రమాదం వాటిల్లుతోందని, ఈ ప్రభావం ఆ దేశంలో చాలా అధికంగా ఉందని ఆయన అన్నారు.

ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2003 నుంచి 2014 వరకు ఆ దేశ వార్షిక ఆర్థిక వృద్ధి రేటు 9.6 శాతంగా ఉందని, 2016లో ఉగ్రవాద చర్యలు మరింత అధికంగా ఉండటం వల్ల వృద్ధి రేటు 2.2 శాతానికి దిగజారిందని, 2017లో ఇది 2.6 శాతంగా నమోదైందని అక్బరుద్దీన్ తెలిపారు.

సరిహద్దు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని, ఆప్ఘనిస్థాన్‌లో శాంతి నెలకొల్పే విషయంలో భారత్‌ కట్టుబడి ఉందని ప్రకటించారు. ఆప్ఘనిస్థాన్‌లో ప్రతిరోజు ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని అన్నారు. పాక్ ఇప్పటికైనా తన బుద్ధిని మార్చుకోవాలని పరోక్షంగా చెప్పారు. 

More Telugu News