Padmaavat: పద్మావత్ సినిమా విడుదలపై.. రాజ్‌పుత్ కర్ణిసేన ఎమర్జెన్సీ మీటింగ్!

  • విడుద‌లకు సిద్ధ‌మైన ప‌ద్మావ‌త్
  • ఆందోళనలకు సిద్ధమవుతోన్న రాజ్‌పుత్ కర్ణిసేన
  • ఈ సినిమాను ప్రదర్శించకూడదు-లోకేంద్ర సింగ్ కల్వి
  • మా పోరాటానికి సామాజిక సంస్థలు సహకరించాలి

సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ ప‌ద్మావ‌తి చిత్రం తీవ్ర వివాదాల్లో చిక్కుకుని, చివరికి విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ విష‌యం తెలిసిందే. రాజ్‌పుత్ రాణి గురించి అవాస్త‌వాల‌ను తెర‌కెక్కించార‌ని ఆరోప‌ణ‌లు చేస్తోన్న రాజ‌్‌పుత్ కర్ణిసేనలు.. ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోన్న నేపథ్యంలో మళ్లీ ఆందళోళనలకు సిద్ధమవుతున్నాయి.

తాజాగా రాజ్‌పుత్ కర్ణిసేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఎవ్వరూ వెళ్లకూడదని, అలాగే థియేటర్ యాజమాన్యాలు ఈ సినిమాను ప్రదర్శించకూడదని అన్నారు. తమకు సామాజిక సంస్థలు సహకరించాలని, ఈ సినిమా విడుదల కాకుండా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సినిమా విడుద‌ల‌కు అనుమ‌తినిస్తూ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై తాను ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వ్యాఖ్యానించారు.     

More Telugu News