balakrishna: మోత్కుపల్లి వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందన!

  • టీఆర్ఎస్ లో టీడీపీని కలిపేసేయాలన్న మోత్కుపల్లి
  • బాలయ్య వద్ద ప్రస్తావించిన మీడియా
  • ఇప్పుడు మాట్లాడలేనన్న బాలయ్య

టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో టీడీపీని టీఆర్ఎస్ లో కలిపేయాలంటూ మోత్కుపల్లి ఈ ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా, ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన తర్వాత మీడియాతో మోత్కుపల్లి మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి టీడీపీని చంద్రబాబు బలోపేతం చేయాలని, లేకపోతే టీఆర్ఎస్ లో కలిపేయాలని సూచించారు. ఈ వ్యాఖ్యలను బాలకృష్ణ వద్ద ప్రస్తావించారు మీడియా ప్రతినిధులు. దీనికి సమాధానంగా బాలయ్య చిరునవ్వు చిందించారు. దీనిపై మాట్లాడటం అప్రస్తుతమని చెప్పారు.

More Telugu News