dulquer salman: 'మహానటి'లో దుల్కర్ పని పూర్తయింది

  • సావిత్రి జీవిత చరిత్రగా 'మహానటి'
  • దుల్కర్ సల్మాన్ పోర్షన్ పూర్తి 
  • మార్చి 29న విడుదల   
సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి' సినిమా తెరకెక్కుతోంది. సావిత్రికి సంబంధించిన అనేక విషయాలను దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా సేకరించి మరీ ఆయన ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ .. సావిత్రి పాత్రను పోషిస్తూ ఉండగా, ఆమె భర్త  జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తూ వచ్చాడు.

తాజాగా ఆయన పోర్షన్ చిత్రీకరణ పూర్తయిందనేది సమాచారం. సావిత్రి జీవితంలో జెమినీ గణేశన్ పాత్ర చాలా కీలకమైనది .. ఆయన స్వభావం కూడా విలక్షణమైనది. అందువలన ఆ పాత్ర కోసం దుల్కర్ సల్మాన్ బాగానే కష్టపడ్డాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. త్వరలో టీజర్ ను రిలీజ్ చేసి, మార్చి 29వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు.      
dulquer salman
keerthi suresh

More Telugu News