mahesh kathi: 'ఓ అబ్బాయిని ప‌వ‌న్ కల్యాణ్ అభిమానులు బ‌ట్ట‌లు విప్పి చిత‌క్కొట్టారు'.. వీడియో పోస్ట్ చేసిన కత్తి మహేశ్!

షార్ట్స్‌లో చూడండి
సినీనటుడు, జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల తీరు బాగోలేదని, ఆయ‌న‌ను దేవుడని పేర్కొంటూ దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నారని సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేశ్ ఆందోళన వ్య‌క్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ రోజు ఓ వీడియోను పోస్ట్ చేసి ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల తీరు ఇదంటూ కామెంట్ చేశారు.

 ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 'అజ్ఞాత‌వాసి' సినిమాను విమ‌ర్శించినందుకు ఓ అబ్బాయిని ప‌వ‌న్ అభిమానులు బ‌ట్ట‌లు విప్పి చిత‌క్కొడుతున్న‌ట్లు ఈ వీడియోలో ఉంది. ఇటువంటి వాటిపై ఎలా స్పందించాలో కూడా త‌న‌కు తెలియ‌డం లేద‌ని క‌త్తి మ‌హేశ్ పేర్కొన్నారు. ఇటువంటి దౌర్జ‌న్యంపైనే తాను గ‌ళం విప్పుతున్నాన‌ని చెప్పారు. 
Go Back to Shorts
mahesh kathi
video
pawan kalyan

More Telugu News