the tashkent files: 'ద తాష్కెంట్ ఫైల్స్' సినిమాలో శ్వేతాబ‌సు ప్ర‌సాద్‌!

షార్ట్స్‌లో చూడండి
'కొత్త బంగారు లోకం' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన శ్వేతాబ‌సు ప్ర‌సాద్ త్వ‌ర‌లో ఓ హిందీ సినిమాలో నటించ‌నుంది. లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మ‌ర‌ణం క‌థాంశంగా తెర‌కెక్క‌నున్న 'ద తాష్కెంట్ ఫైల్స్' చిత్రంలో ఈమె న‌టించ‌బోతోంది. మాజీ ప్ర‌ధాని మ‌ర‌ణంపై అధ్య‌య‌నం చేసే పాత్రికేయురాలు రాగిణి ఫూలే పాత్ర‌లో శ్వేతాబ‌సు క‌నిపిస్తుంది.

ఇటీవల ఆమె హిందీలో 'చంద్ర‌నందిని' అనే సీరియ‌ల్‌లోను, 'బ‌ద్రీనాథ్ కీ దుల్హానియా' చిత్రంలోనూ కనిపించింది. ద తాష్కెంట్ ఫైల్స్ చిత్రంలో తాను న‌టించ‌నున్న విష‌యాన్ని ఇన్‌స్టాగ్రాం ద్వారా శ్వేతాబ‌సు వెల్ల‌డించింది. వివేక్ అగ్నిహోత్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో న‌సీరుద్దీన్ షా, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్నారు.
Go Back to Shorts
the tashkent files
shwetha basu prasad

More Telugu News