Vijayawada: దుబాయ్, షార్జాలకు విజయవాడ నుంచి తొలి ఇంటర్నేషనల్ విమాన సర్వీస్.. రేపే ప్రారంభం!

  • తీరనున్న అమరావతి వాసుల మరో కల
  • దుబాయ్, షార్జాలకు వెళ్లనున్న విమానం
  • ఎయిర్ ఇండియా సేవలు అందుబాటులోకి
  • ప్రారంభించనున్న అశోక గజపతిరాజు

రోజురోజుకూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ, అమరావతి వాసుల మరో కల తీరనుంది. ఇక్కడి నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసు రేపు ప్రారంభం కానుంది. ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా ఈ ఘనతను సొంతం చేసుకోనుంది. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో జరిగే ఓ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తొలి సర్వీసును ప్రారంభించనున్నారు.

దుబాయ్, షార్జాలకు ఈ విమానం నడుస్తుంది. విజయవాడలో ఇప్పటికే ఇమిగ్రేషన్, కస్టమ్స్ విభాగాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ విమానం ఉదయం 8 గంటలకు ముంబై నుంచి బయలుదేరి 9.45కు విజయవాడకు వచ్చి, ఆపై ఉదయం 10.30కి బయలుదేరి ముంబై మీదుగా దుబాయ్, షార్జాలకు వెళుతుంది. ముంబైకి అక్కడి నుంచి యూఏఈకి వెళ్లే సౌకర్యాన్ని కల్పిస్తున్న ఈ విమానానికి మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రైవేటు విమాన సంస్థలు ఇంటర్నేషనల్ సర్వీసులను విజయవాడ నుంచి ప్రారంభించేందుకు సాహసం చేయలేకపోతున్న వేళ, ఎయిర్ ఇండియా ముందుకు రావడం గమనార్హం.

More Telugu News