prabhas: ప్రభాస్ సరసన దీపికా పదుకొనె?

  • 'సాహో'తో బిజీగా ప్రభాస్ 
  • హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ 
  • తదుపరి సినిమా హిందీలో

ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా పనుల్లో వున్నాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హిందీలోనూ విడుదల చేయనున్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తోంది.

ఈ సినిమా తరువాత బాలీవుడ్ సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఆ సినిమాలో ఆయన సరసన నటించడానికి గాను దీపికా పదుకొనెను సంప్రదిస్తున్నారట. ఒకవేళ ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోతే, కత్రినా కైఫ్ ను గానీ .. అలియాభట్ ను గాని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక ఈ సినిమాతో పాటు 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోను ఓ తెలుగు సినిమా చేయాలనేది ప్రభాస్ ఆలోచన. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.   

More Telugu News