ramgopal varma: ఆ పుస్తకానికి 'నా చావు నేను చస్తా.. నీకెందుకు?' అని పేరు పెట్టుకుంటా!: రామ్ గోపాల్ వ‌ర్మ

  • తన ఆత్మకథ రాసుకుంటే ఆ పేరు పెట్టుకుంటానన్న వర్మ
  • తన కొత్త సినిమా కథ తనదేనంటోన్న ఓ యువకుడి ఆరోపణపై స్పందించని దర్శకుడు
  • తన సినిమాలు చూడాలా? వద్దా? అని నిర్ణయించుకునే స్వేచ్ఛ ప్రేక్షకులకు ఉందని వ్యాఖ్య

తాను ఆత్మకథ రాసుకుంటే ఆ పుస్తకానికి 'నా చావు నేను చస్తా నీకెందుకు?' అని పేరు పెట్టుకుంటాన‌ని ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా వివాదాస్ప‌ద  ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సమాధానం ఇచ్చారు. ఈ రోజు మ‌హా న్యూస్‌ ఛానెల్ నిర్వ‌హించిన ఓ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రామ్ గోపాల్ వ‌ర్మ.. యువ‌తులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతూ ఈ విష‌యాన్ని చెప్పారు.

 అలాగే, గాడ్, సెక్స్‌, ట్రూత్ పేరుతో శృంగార‌మే ప్ర‌ధానాంశంగా రామ్ గోపాల్ వ‌ర్మ తీస్తోన్న సినిమా క‌థ త‌నద‌ని ఓ యువ‌కుడు అంటున్నాడ‌ని ఇది నిజమా? అని అడ‌గ‌గా.. దానికి వ‌ర్మ స‌మాధానం ఇవ్వ‌డానికి నిరాకరించారు. ఈ విష‌యంపై తాను ఏమీ మాట్లాడ‌ద‌ల‌చుకోలేద‌ని చెప్పారు. త‌న సినిమాను చూడాలనుకుంటే చూడాల‌ని, చూడొద్ద‌నుకుంటే చూడొద్ద‌ని ఆ స్వేచ్ఛ ప్రేక్ష‌కుల‌కు ఉంద‌ని చెప్పుకొచ్చారు. తాను వాట్సప్‌లో మెసేజ్‌లు ఇస్తుంటానని, సినిమాల్లో మాత్రం మెసేజ్‌లు (సందేశాలు) ఇవ్వబోనని చురకలంటించారు. 

More Telugu News