రేపటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు... రియల్ఎస్టేట్ జీఎస్టీ పరిధిలోకి?
- 12 శాతం శ్లాబులోకి రియల్ఎస్టేట్
- దాదాపు 80 వస్తువులపై పన్ను శ్లాబు తగ్గించే అవకాశం
- జీఎస్టీ రిటర్నుల ప్రక్రియను సులభతరం చేసే అంశంపై చర్చ
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు జీఎస్టీ రిటర్నుల ప్రక్రియను సులభతరం చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా.. గత సమావేశాల్లో 28శాతం శ్లాబులో ఉన్న చాలా వస్తువులను కింది శ్లాబులకు తగ్గించారు. ప్రస్తుతం 50 వస్తువులు మాత్రమే 28శాతం శ్లాబులో ఉన్నాయి.