varun tej: 'తొలిప్రేమ' ఆడియో రిలీజ్ డేట్

  • వరుణ్ తేజ్ హీరోగా 'తొలిప్రేమ'
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • ఈ నెల 20వ తేదీన ఆడియో రిలీజ్

వరుణ్ తేజ్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'తొలిప్రేమ' చిత్రం తెరకెక్కింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ హృదయానికి హత్తుకునే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కిందని అన్నారు.

"పాత్రలను మలచినతీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. వరుణ్ తేజ్ తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా, న్యూ లుక్ తో ఈ సినిమాలో కనిపించనున్నాడు. తమన్ అందించిన సంగీతం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ నెల 20వ తేదీన పాటలను రిలీజ్ చేయనున్నాం. ఆడియో రిలీజ్ తరువాత ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయం" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.    

More Telugu News