devisri prasad: దేవిశ్రీ మ్యూజిక్ కి ఉన్న క్రేజ్ అలాంటిది!

షార్ట్స్‌లో చూడండి
యూత్ లో దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సంగీతానికి వాళ్లు ఉత్సాహంతో ఊగిపోతారు .. ఉల్లాసంతో గంతులేస్తారు. హీరోల అభిమానులంతా కూడా తమ హీరో సినిమాకి దేవిశ్రీ పనిచేస్తే బాగుంటుందనే భావిస్తారు. అలాంటి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలోనే మహేశ్ బాబు 'భరత్ అనే నేను' .. చరణ్ 'రంగస్థలం' రూపొందుతున్నాయి.

 'భరత్ అనే నేను' సినిమా ఆడియో రైట్స్ ను 2 కోట్ల రూపాయలకు, 'రంగస్థలం' ఆడియో రైట్స్ ను 1.6 కోట్లకు 'లహరి' మ్యూజిక్ వారు కొనుగోలు చేసినట్టుగా సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి యూత్ లో గల క్రేజ్ కారణంగానే, ఈ రెండు సినిమాలకి ఈ స్థాయి రేటు పలికిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 'భరత్ అనే నేను' ఏప్రిల్ 27వ తేదీన .. 'రంగస్థలం' మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.      
Go Back to Shorts
devisri prasad

More Telugu News