Uttar Pradesh: మసీదు గోడలకు కాషాయపు రంగు... తీసేయించిన కలెక్టర్ ను తొలగించిన యూపీ ప్రభుత్వం

  • ఈ నెల 5న మసీదు గోడల రంగు మార్చిన అధికారులు
  • ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు కాషాయపు రంగును తొలగించిన ఐఏఎస్ అధికారి
  • అతన్ని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ

ఈనెల 5వ తేదీన ఉత్తర ప్రదేశ్ లోని ఓ మసీదుకు కాషాయపు రంగు వేసిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా, వెంటనే స్పందించి, తిరిగి పాత రంగునే వేయాలని ఆదేశించిన ఐఏఎస్ అధికారిపై యోగి ఆదిత్యనాథ్ సర్కారు వేటు వేసింది. హజ్ కమిటీ అధికారిగా ఉన్న ఆర్పీ సింగ్, మసీదు గోడలపై ఉన్న కాషాయపు రంగును తీసేయించి, తిరిగి పాత రంగును దగ్గరుండి వేయించి, పరిస్థితిని శాంతింపజేయగా, ఆయనకు లభించిన గౌరవం ఇది.

ఆర్పీ సింగ్ ను తక్షణమే యూపీ హజ్ కమిటీ అదనపు కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ సంవత్సరం హజ్ యాత్రికుల సబ్సిడీని నిలిపివేస్తున్నామని కేంద్రం ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ, ఇప్పుడు యోగి సర్కారు తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.

More Telugu News