Shoab Malik: తలకి బంతి తగిలి మైదానంలో కుప్పకూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

  • న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డేలో ఘటన
  • బంతి బలంగా తలకు తాకడంతో కుప్పకూలిన వైనం
  • చికిత్సతో తేరుకున్నా ఆ వెంటనే అవుట్
ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా తలకు తగలడంతో పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ కుప్పకూలిపోయాడు. బాధతో విలవిల్లాడుతున్న షోయబ్‌ను వెంటనే గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లి చికిత్స అందించారు.

హమిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 32 వ ఓవర్‌లో షాట్ కొట్టి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే బంతి ఫీల్డర్ మున్రో చేతికి చేరడంతో అవతలి ఎండ్‌లో ఉన్న మహమ్మద్ హఫీజ్ వద్దని వారించాడు. దీంతో మాలిక్ వెనక్కి మళ్లాడు.

ఈ క్రమంలో రనౌట్ చేసేందుకు ప్రయత్నించిన మున్రో బంతిని బలంగా వికెట్ల వైపు విసిరాడు. అది కాస్తా మాలిక్ తల వెనకవైపు బలంగా తాకింది. దీంతో విలవిల్లాడుతూ అక్కడే కుప్పకూలిపోయాడు. వైద్య సిబ్బంది అతడికి చికిత్స అందించడంతో కోలుకుని తిరిగి బ్యాటింగ్‌కు దిగాడు. అయితే దెబ్బ బలంగా తాకడంతో ఏకాగ్రత కోల్పోయిన మాలిక్ (6) ఆ వెంటనే అవుటయ్యాడు.
Shoab Malik
Pakistan
Newzealand

More Telugu News