KCR: కేసీఆర్, మోదీ, చంద్రబాబు... ఏపీలో ఆకర్షణగా నిలిచిన పోస్టర్!

  • ఏపీలో కేసీఆర్ కు పెరుగుతున్న అభిమానులు
  • తూర్పు గోదావరి జిల్లాలో వెలిసిన ప్లెక్సీ
  • అందరినీ ఆకర్షించిన పోస్టర్
ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లెక్సీలు విరివిగా వెలుస్తున్నాయి. ఏపీలో కేసీఆర్ కు అభిమానులు పెరుగుతున్నారన్న విషయాన్ని మరోమారు గుర్తు చేస్తూ, తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో వెలిసిన ప్లెక్సీ అందరినీ ఆకర్షించింది. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, గ్రామానికి చెందిన అందుకూరి వేంకటేశ్వర్లు, కూరాటి చిన్న దీన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్, నరేంద్ర మోదీ, చంద్రబాబునాయుడి నిలువెత్తు చిత్రాలను ముద్రించారు. పైన అంబేద్కర్ చిత్రాన్ని, సరిహద్దుల్లో జవాన్లను, గ్రామంలోని గుడిని ఉంచారు. ఆ గ్రామంలో ఈ ప్లెక్సీ సంక్రాంతికి వచ్చిన వారికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
KCR
Narendra Modi
Chandrababu
East Godavari

More Telugu News