Kathi Mahesh: మళ్లీ మీడియా ముందుకు మహేశ్ కత్తి!: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అడిగిన ఏడు ప్రశ్నలకు సమాధానాలు

  • ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న ఫ్యాన్స్ సామాజిక విధ్వంసకారులుగా త‌యార‌య్యారు
  • పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు
  • నా తండ్రి మా గ్రామంలోనే ఉన్నారు 
  • మా తల్లి చిట్టీల పేరిట మోసం చేసిందని పవన్ ఫ్యాన్స్ అసత్య ప్రచారం చేస్తున్నారు

కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సంధించిన ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆ వివరాలు ...

1. నీ తండ్రి వ్యవసాయ అధికారిగా ఎన్ని కోట్లు మింగాడు?

మ‌హేశ్ క‌త్తి సమాధానం: ఆయ‌న రిటైర్ మెంటుతో వ‌చ్చిన డ‌బ్బుల‌తో మా ఊరిలో, మాకు ఉన్న స్థ‌లంలో చిన్న ఇల్లు క‌ట్టుకుని ఉంటున్నారు. కోట్లు ఉన్నాయ‌నేది ఫ్యాన్స్ ఊహించుకుని ఆరోపణ‌లు చేస్తున్నారు. నేను ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నాన‌ని, హుందాగా క‌న‌ప‌డుతున్నాన‌ని ప‌వ‌న్‌ ఫ్యాన్స్ మా తండ్రి వ‌ద్ద బాగా డ‌బ్బుంద‌ని అనుకుని, ఇటువంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

2. నీ కుటుంబం గ్రామానికి ఎందుకు రాదు?

స‌మాధానం: నా కుటుంబం గ్రామంలోనే ఉంది.. మా తండ్రి అక్క‌డే ఇల్లు క‌ట్టుకుని ఉంటున్నారు.

3. బిగ్ బాస్ షోలో ఎంట్రీకి వైసీపీ నేత అంబటి రాంబాబు నిన్ను ఎందుకు రిఫర్ చేశారు?

స‌మాధానం: బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారిని ముంబయి బృందం వచ్చి సెలెక్ట్ చేసింది. 80 మందిని ఇంటర్వ్యూ చేసి కొందరిని మాత్రమే ఎంపిక చేసింది. వాళ్లు చేసిన ఎంపికకు, అంబటి రాంబాబుకు ఏమిటి సంబంధం?

4. నువ్వు ప‌వ‌న్‌ని టార్గెట్ చేసినందుకు వైసీపీ నీకు ఎంత డ‌బ్బు ఇచ్చింది?

స‌మాధానం: నా కోసం నేను పోరాడుతుంటే, నా ఆత్మ‌గౌర‌వం కోసం ప్ర‌శ్నిస్తోంటే వైసీపీ నా వెనుక ఉందంటూ అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు ఆయ‌న ఫ్యాన్స్ సామాజిక విధ్వంసకారులుగా త‌యార‌య్యారు.

5. గ్రామ వాసులను చిట్టీల పేరుతో నీ తల్లి ఎందుకు మోసం చేసింది?

సమాధానం: నా తల్లి ఎన్నడూ చిట్టీలు వేయలేదు. ఆమె కేన‌్సర్‌తో రెండేళ్ల క్రితం చనిపోయింది.

6. నువ్వు నీ సోదరి భర్తను బెదిరించి డబ్బులు లాగడానికి ఎవరు సాయం చేశారు?

సమాధానం:  ఆయ‌న పేరు కృష్ణ భ‌గ‌వాన్‌.. ఆయ‌న త‌న ఉద్యోగాన్ని చేసుకుంటూ బ‌తుకుతుంటాడు.. నా సోద‌రి జీవితం ఇప్పుడు సంతోషంగా ఉంది. న‌న్ను దెబ్బ తీయాల‌నే ఉద్దేశంతో నా కుటుంబంపై ఇటువంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

7. నీ కుటుంబం ఎటువంటి తప్పూ చేయకపోతే సంక్రాంతికి సొంత గ్రామానికి ఎందుకు రాలేదు?

సమాధానం: నేను సంక్రాంతికి నా ఊరికి వెళ్లాను.. నా తండ్రి కూడా ఆ ఊరిలోనే ఉన్నారు. అప్పుడప్పుడు నేను ఊరికి వెళ్లి వస్తూనే ఉన్నాను.

ఈ విధంగా మహేశ్ కత్తి సమాధానాలు ఇచ్చారు. 

More Telugu News