vallabhaneni: ఎన్టీరామారావు గురించి నేను విన్నది వేరు .. తెలుసుకున్నది వేరు!: దర్శకుడు వల్లభనేని జనార్దన్

  • ఎన్టీఆర్ గురించి కొంతమంది చెప్పుకునే తీరు అలా ఉండేది
  • దగ్గరగా ఉంటూ పరిశీలించాను 
  • ఆయన ఎంత గొప్పవారో అర్థమైంది

ఎన్టీ రామారావు గారి గురించి నేను చాలా విన్నాను .. 'రామారావుగారు రాగానే కాళ్లమీద పడి నమస్కారం చేయాలి .. లేదంటే కోపం వచ్చేసి పనిలో నుంచి తీసేస్తారు' అని అప్పట్లో చెప్పుకునేవారు. 'గజదొంగ' సినిమా కోసం నేను రాఘవేంద్ర రావు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనికి చేరాను. ఎన్టీ రామారావు గారంటే నాకు చాలా ఇష్టం .. మరి బయట ఆయన గురించి కొంతమంది ఇలా చెప్పుకుంటున్నారు.

నిజంగానే ఆయన అటువంటివాడా .. కాదా? చూద్దామనిపించి .. ఆయనకి నేను నమస్కారం చేయలేదు. ఆ సినిమాకి పనిచేస్తున్నంత కాలం నమస్కారం పెట్టలేదు .. నిజం చెప్పాలంటే అసలాయన ఆ సంగతే పట్టించుకోలేదు. ఆయన గురించి కొంతమంది చేసే ప్రచారంలో ఎంత అబద్ధం ఉందనేది నాకు అప్పుడు అర్థమైంది. డైలాగ్స్ ను ఆయన బాగా సాధన చేస్తారు. అవసరమైతే మరొక్క టేక్ తీసుకుందాం అంటూ డైరెక్టర్ ను రిక్వెస్ట్ చేయడం ఆయనలో కనిపించే గొప్పగుణం" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News