ajay devagan: రకుల్ మరో భారీ ఛాన్స్ ను పట్టేసింది

  • తెలుగు .. తమిళ చిత్రాలతో రకుల్ బిజీ
  • హిందీ అవకాశాలపై ప్రత్యేక దృష్టి 
  • అజయ్ దేవగణ్ సరసన ఛాన్స్    

తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోన్న రకుల్ మరోపక్క, తమిళ .. హిందీ భాషా చిత్రాలపై కూడా దృష్టి పెట్టింది. తమిళంలో అగ్ర కథానాయకుల సరసన అవకాశాలను అందుకుంటూ వెళుతోంది. ఈ క్రమంలో తమిళంలో సూర్య జోడీగా ఒక మంచి అవకాశాన్ని దక్కించుకుంది. హిందీలోను మరో భారీ ఛాన్స్ ను పట్టేసిందనేది తాజా సమాచారం.

ఆల్రెడీ సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రకుల్ చేసిన ఓ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగానే ఆమెకి అజయ్ దేవగణ్ జోడీగా చేసే మరో ఛాన్స్ వచ్చింది. రంజన్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో రకుల్ సిటీ అమ్మాయిగా చాలా మోడ్రన్ గా కనిపిస్తుందట. ఆమె స్వభావం కూడా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లి .. దసరాకి ఈ సినిమాను విదుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.     

More Telugu News