infosys: ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు పండగ సర్‌ప్రైజ్‌

షార్ట్స్‌లో చూడండి
భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఊహించని సంక్రాంతి కానుకను అందించింది. డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి గాను 95 శాతం వేరియబుల్ పే అందించింది. గత తొమ్మిది త్రైమాసికాలతో పోలిస్తే ఇదే అత్యధికమని... దీన్ని తాము ఊహించలేదని ఓ ఉద్యోగి ఆనందం వ్యక్తం చేశాడు. డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో నికర లాభంలో 38 శాతం వృద్ధిని సాధించింది. అంతేకాదు, అక్టోబర్-డిసెంబర్ నెలల మధ్య కాలంలో 12,622 నియామకాలను చేపట్టింది. ఇటీవలే మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా తమ ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే ప్రకటించింది. 
Go Back to Shorts
infosys
gift to infosys employees

More Telugu News