CAR: మితి మీరిన వేగంతో వచ్చి.. గాల్లో పల్టీలు కొట్టి రెండో అంతస్తులోకి దూసుకెళ్లిన కారు!

  • దక్షిణ కాలిఫోర్నియాలో ఘటన
  • ఇద్దరికి గాయాలు
  • కార్యాల‌యం గోడ ధ్వంస‌ం

సినిమా సీన్ల‌లో క‌నిపించే మాదిరిగా ఓ కారు అదుపుతప్పి గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టి ఓ కార్యాలయం రెండో అంతస్తులోకి దూసుకెళ్లిన ఘ‌టన దక్షిణ కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఆ కారు మితి మీరిన వేగంతో రావ‌డ‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని అక్క‌డి పోలీసులు చెప్పారు.

ఆ సమయంలో కారులో ఇద్దరు వ్య‌క్తులు ఉన్నార‌ని, ఒకరు గాయాలపాలై కారులోంచి త్వ‌ర‌గానే బ‌య‌ట‌కు రాగా, మరో వ్యక్తి మాత్రం అందులో ఇరుక్కుపోవ‌డంతో అత‌డిని రెస్క్యూ టీమ్ బ‌‌య‌టకు తీసింది. అనంత‌రం వాహనాన్ని క్రేన్‌ సహాయంతో కిందికి దించి తీసుకెళ్లారు. ఈ కారును న‌డుపుతోన్న స‌మ‌యంలో డ్రైవర్‌ డ్రగ్స్‌ తీసుకున్నాడ‌ని పోలీసులు గుర్తించారు. కారు ఢీ కొని ఇరుక్కుపోవ‌డంతో ఆ కార్యాల‌యం గోడ ధ్వంస‌మైంది.  

More Telugu News