Uttar Pradesh: యూపీలో హనుమంతుని మహిమ... మూడు క్రేన్లు విరిగాయే తప్ప అంగుళం కూడా కదలని విగ్రహం!

  • హైవే ఆనుకుని130 ఏళ్ల నాటి భారీ విగ్రహం
  • విస్తరణలో భాగంగా తొలగించాలని యోగి సర్కారు నిర్ణయం
  • విగ్రహాన్ని పెకిలించడంలో విఫలం

ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్... అది 130 ఏళ్ల నాడు ప్రతిష్ఠించిన హనుమంతుని భారీ విగ్రహం. జాతీయ హైవే 24ను ఆనుకుని ఉంది. రోడ్ల విస్తరణలో భాగంగా విగ్రహాన్ని, గుడిని మరో ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం భావించింది. స్థానిక హిందూ వాహిని తీవ్రంగా అభ్యంతర పెడుతున్నా, యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ముందడుగు వేసింది. ఆ తరువాత జరుగుతున్న పరిస్థితులే ఆ విగ్రహాన్ని వార్తల్లో ప్రధాన శీర్షికలోకి ఎక్కించాయి.

హనుమంతుని విగ్రహాన్ని చెక్కు చెదరకుండా మరో ప్రాంతానికి తరలించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలు వరుసగా విఫలం అవుతున్నాయి. విగ్రహాన్ని పెకిలించేందుకు తెచ్చిన మూడు జేసీబీ మెషీన్లు విరిగిపోయాయే తప్ప విగ్రహం అంగుళమైనా కదలలేదు. రోడ్ల కాంట్రాక్టును పొందిన సంస్థకు లక్షల రూపాయల్లో నష్టం వాటిల్లింది. దీంతో హనుమంతుడికి అక్కడ ఉండాలన్నదే ఇష్టమని, అక్కడి నుంచి తొలగించాలని చూస్తే ప్రమాదాలు సంభవిస్తాయని ఇక్కడి ప్రజలిప్పుడు నమ్ముతున్నారు. విగ్రహం కదలకపోవడం ఆంజనేయుని మహిమేనని అంటున్నారు. విగ్రహాన్ని పెకిలించాలన్న అధికారుల ప్రయత్నాలకు సంబంధించిన వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News