amaravathi: అమరావతి ప్రాంతంలో సందడి చేసిన బుల్లితెర నటీమణులు

  • అల్లూరు గ్రామంలో మెరిసిన తారలు
  • ముగ్గుల పోటీలో సందడి
  • వస్త్రాలను బహూకరించిన వైసీపీ నేత అరుణ్ కుమార్
అమరావతి ప్రాంతంలోని అల్లూరు గ్రామంలో బుల్లితెర నటీమణులు ప్రీతి నిగం, సౌజన్య, జ్యోతి పూర్ణిమ, సుమనశ్రీ, శ్రీనిధిలు సందడి చేశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముగ్గుల పోటీ కార్యక్రమంలో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగకు గ్రామీణ ప్రాంతమైన అల్లూరుకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, సర్పంచ్ కోటేరు సూర్యనారాయణరెడ్డిలు వీరికి నూతన వస్త్రాలను బహూకరించి, సత్కరించారు. 
amaravathi
tv stars

More Telugu News