Chiranjeevi: చిరంజీవి గారు ఒప్పుకున్నారు..నా ఆనందానికి అవధుల్లేవు: హీరో నాగశౌర్య

  • జనవరి 25న నాగశౌర్య చిత్రం ‘ఛలో’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్
  • ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న చిరంజీవి
  • ఈ విషయాన్ని ఓ పోస్ట్ లో పేర్కొన్న నాగశౌర్య

వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నాగశౌర్య నటిస్తున్న చిత్రం ‘ఛలో’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్న విషయాన్ని నాగశౌర్య తెలిపాడు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ మేరకు ఓ పోస్ట్ చేశాడు. ‘జనవరి 25న నిర్వహించే ‘ఛలో’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి గారు అంగీకరించారు. భోగి పండగ సందర్భంగా ఈ విషయం చెప్పడం నాకు సంతోషంగా ఉంది. నా ఆనందానికి అవధుల్లేవు. థ్యాంక్యూ సోమచ్ సార్’ అని ఆ పోస్ట్ లో నాగశౌర్య పేర్కొన్నాడు.

 ఈ పోస్ట్ తో క్లీన్ షేవ్ తో ఉన్న చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను నాగశౌర్య జతపరిచాడు. ‘ఛలో’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి వస్తానని చెప్పడంతో తన ఆనందానికి అవధుల్లేవని నాగశౌర్య చెప్పినట్టుగానే ఆ ఫొటోలో అమితానందంతో నవ్వుతూ ఉన్నాడు.

More Telugu News