Balakrishna: ‘జై సింహా’ లాంటి హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: ప్రముఖ హీరో బాలకృష్ణ

  • ‘మానధనులు మన తెలుగు వాళ్లు..అభిమాన ధనులు నా అభిమానులు
  • ఈ రెండింటిని నేను సంపాదించుకున్నా
  • జై సింహా లాంటి సినిమాలను అందరూ ఆదరించాలి : బాలకృష్ణ

‘జై సింహా’ లాంటి హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలని, అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా'నని ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ, తమకు ఇలాంటి విజయాలను ప్రేక్షక దేవుళ్లు మరిన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు. ‘మాన ధనులు మన తెలుగు వాళ్లు..అభిమాన ధనులు నా అభిమానులు. ఈ రెండింటిని నేను సంపాదించుకున్నా. జై సింహా లాంటి మంచి సినిమాలను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News