సీఐపై దాడి కేసులో ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష
- సీఐపై దాడి కేసు
- 11 మందికి రెండేళ్ల జైలు శిక్ష
- తీర్పును వెలువరించిన గూడూరు కోర్టు
కేసు వివరాల్లోకి వెళ్తే, 2011 అక్టోబర్ 3న అంకులపాటూరులో వీఎస్ఎఫ్ అనే కంపెనీ ఏర్పాటు చేయాలనుకున్న విద్యుత్ పరిశ్రమ కోసం ప్రజాభిప్రాయ సేకరణను అప్పటి తహసీల్దార్ రోజ్ మాండ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా, పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా కొందరు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి గూడూరు సీఐ రాంబాబుపై పలువురు దాడి చేసి గాయపరిచారు. దీంతో, అప్పట్లో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, 12 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో, వీరిపై నేరారోపణలు రుజువు కావడంతో, ఒక్కొక్కరికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 4,700 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ 12 మంది నిందితుల్లో ఒకరు ఇప్పటికే చనిపోయారు.