Telangana: తెలంగాణలో ప్రభుత్వ 'పెళ్లికానుక' ఇకపై లక్షా నూటపదహారు!

  • తెలంగాణ ప్రజలకు సంక్రాంతి తీపికబురు
  • కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కానుక పెంపు
  • రూ. 75,116 నుంచి రూ. 1,00,116
  • నిర్ణయించిన కేసీఆర్

తెలంగాణ సర్కారు సంక్రాంతి శుభవేళ ఓ తీపి కబురును అందించింది. పేదవారి ఇళ్లల్లో జరిగే అమ్మాయిల వివాహాలకు ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సాయాన్ని మరింతగా పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో అసెంబ్లీ ముందుకు రానున్న బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై నిర్ణయం వెలువడనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌ పేరిట, గత నాలుగేళ్లుగా అమలవుతున్న పథకంలో భాగంగా, ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందిన ఆడ పిల్లలకు పెళ్లి కానుకగా రూ. 75,116 అందిస్తుండగా, దాన్ని రూ. 1,00,116కు పెంచాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తదుపరి బడ్జెట్‌లో పథకం అమలుకు కావాల్సినన్ని నిధులు కేటాయించాలని ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పండగ వెళ్లగానే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News