isro: కాసేపట్లో నింగికెగరనున్న పీఎస్ఎల్వీ-సీ40.. ఒకేసారి 31 ఉపగ్రహాలు!

  • 9.29 గంటలకు ప్రయోగం
  • 31 ఉపగ్రహాలను తీసుకెళ్తున్న రాకెట్ 
  • వీటిలో 28 విదేశీ ఉపగ్రహాలు

భారతీయ అంతరిక్ష కేంద్రం ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. కాసేపట్లో పీఎస్ఎల్వీ-సీ40 ద్వారా ఒకేసారి 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టబోతున్నారు. వీటిలో మూడు స్వదేశీ, 28 విదేశీ నానో శాటిలైట్లు ఉన్నాయి. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించనున్నారు. గురువారం ఉదయం 5.29 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ 28 గంటలపాటు కొనసాగనుంది. ఈ ఉదయం 9.29 నిమిషాలకు పీఎస్ఎల్వీని ప్రయోగిస్తారు.

More Telugu News