Telangana: హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిపోయిన ‘రైల్ నీర్’ ప్రాజెక్టు.. వేలాదిమందికి ఉపాధి!

  • ఏపీకి వరంగా మారిన తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం
  • రైల్ నీర్ ప్రాజెక్టు నూజివీడుకు షిఫ్ట్
  • మొత్తం పదివేల మందికి ఉపాధి అవకాశాలు

తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌కు వరమైంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్వంలో రూ.50 కోట్ల అంచనాలతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిన ప్రతిష్ఠాత్మక ‘రైల్ నీర్’ ప్రాజెక్టు ఏపీకి తరలిపోయింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా ఐదువేల మందికి, పరోక్షంగా మరో ఐదు వేలమందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

‘రైల్ నీర్’ ప్రాజెక్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు 2012లో ప్రయత్నాలు మొదలైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు భూమి, ఇతర వనరులను కేటాయించలేదు. దీంతో ఇక లాభం లేదని భావించిన ఐఆర్‌సీటీసీ దానిని ఏపీకి తరలించింది. నూజివీడు దగ్గర ఫ్యాక్టరీని నిర్మించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎకరం భూమిని కేటాయించింది.

More Telugu News