Balakrishna: పవన్ అభిమానిపై బాలయ్య అభిమాని దాడి.. శ్రీకాకుళంలో ఉద్రిక్తత!
- సినిమాల విషయంలో అభిమానుల మధ్య గొడవ
- పవన్ అభిమానిపై బ్లేడుతో దాడి
- పోలీసుల అదుపులో నిందితుడు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానుల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణ చివరికి ఒకరిపై ఒకరు దాడిచేసుకునే వరకు వెళ్లింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లాలోని పురుషోత్తపురంలో అజ్ఞాతవాసి, జై సింహా సినిమాల విషయంలో బాలయ్య, పవన్ అభిమానుల మధ్య మాటామాటా పెరిగింది.
అది క్రమంగా వేడెక్కి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. గొడవ మరింత ముదరడంతో బాలయ్య అభిమాని పవన్ అభిమానిపై బ్లేడుతో దాడిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పవన్ అభిమానిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.