Pradeep: కోర్టుకు రాలేనేమో... పోలీసులతో యాంకర్ ప్రదీప్!

  • షూటింగులతో బిజీగా ఉన్నాను
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన ప్రదీప్
  • నేడు కోర్టుకు హాజరు కావడంపై సందిగ్ధత
తాను నేడు కూడా కోర్టుకు హాజరు కాలేనని డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన నటుడు, యాంకర్ ప్రదీప్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తాను షూటింగ్ లో బిజీగా ఉన్నానని ప్రదీప్ తెలిపాడు. కాగా, సోమవారం నాడు గోషామహల్ పోలీసు స్టేషన్ లో కౌన్సెలింగ్ కు హాజరైన ప్రదీప్, మంగళవారం నాడు కోర్టుకు హాజరు కావాల్సి వున్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాలంటూ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే.

దీనిపై పోలీసు ఉన్నతాధికారులు కాస్తంత సీరియస్ గానే స్పందించి, మరోసారి నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో ప్రదీప్ నేడు కచ్చితంగా నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరు అవుతాడని భావించగా, ఇప్పుడు తాను షూటింగ్ లో బిజీగా ఉన్నానని ఆయన చెప్పడంతో కోర్టుకు హాజరయ్యే విషయమై సందిగ్ధత ఏర్పడింది.
Pradeep
Anchor
Drunken Drive
Nampalli Court
Police

More Telugu News