oprah winfrey: ఆమె అంటే నాకు ఇష్టమే.. కానీ బరిలోకి దిగితే..:ట్రంప్

  • అధ్యక్ష ఎన్నికల బరిలోకి ఓప్రా
  • ఆమె పోటీ చేస్తారని భావించడం లేదన్న ట్రంప్
  • ఒకవేళ బరిలోకి దిగితే ఓడిస్తా
ప్రముఖ అమెరికన్ టెలివిజన్ సెలబ్రిటీ ఓప్రా విన్ ఫ్రే ఆ దేశ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారంటూ ఆమె సన్నిహిత మిత్రులు చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె కచ్చితంగా అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో నిలబడతారని... గెలుపొందుతారని వారు అన్నారు.

ఈ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఓప్రాను వ్యక్తిగతంగా తాను ఎంతగానో ఇష్టపడతానని... అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో ఆమె నిలబడతారని తాను భావించడం లేదని ఆయన అన్నారు. ఆమె తనకు సన్నిహితురాలు కూడా అని... గతంతో ఓసారి ఆమె నిర్వహించిన కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్నానని చెప్పారు. ఒకవేళ నిజంగానే ఆమె ఎన్నికల బరిలోకి దిగితే... కచ్చితంగా ఆమెను ఓడిస్తానని అన్నారు. ఆమె ఎన్నికల బరిలోకి దిగుతుందని తాను భావించడం లేదని చెప్పారు. 
oprah winfrey
Donald Trump

More Telugu News