TTelugudesam: పోలీసుల అదుపులో టీటీడీపీ నేత వంటేరు.. స్టేషన్‌లో నిరాహారదీక్ష!

  • ఓయూ ఆందోళన కేసులో నిందితుడిగా వంటేరు
  • నెల రోజులుగా అజ్ఞాతంలో
  • ఫలించని ముందస్తు బెయిల్ ప్రయత్నాలు

నెల రోజులుగా అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ టీడీపీ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డిని నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఆందోళన కేసులో వంటేరు నిందితుడిగా ఉన్నారు. ప్రతాప్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్‌లోనే ఆయన నిరాహార దీక్షకు దిగారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినా ఫలించలేదని ఆయన అనుచరులు పేర్కొన్నారు.

మరోవైపు బంజారాహిల్స్ నుంచి కొంపల్లి వెళ్తుండగా సుచిత్ర సర్కిల్ వద్ద తన తండ్రిని అరెస్ట్ చేసినట్టు ప్రతాప్‌రెడ్డి కుమారుడు విజయవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు గజ్వేల్ కార్యకర్తలతో సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

More Telugu News