helicopter: హెలికాప్టర్‌ను తాడుతో కట్టి మోసుకెళ్లిన వైనం!

షార్ట్స్‌లో చూడండి
ఓ హెలికాప్టర్‌ను మరో హెలికాప్టర్‌ మోసుకెళ్లిన దృశ్యం జపాన్‌లోని ఒఖినావా ప్రాంతంలో కనపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. రోడ్డుపై వాహనాలు చెడిపోతే మరో వాహనం సాయంతో తీసుకెళతారు.. ఇదే టెక్నిక్‌ను హెలికాఫ్టర్‌కు కూడా ఉపయోగించడం పట్ల అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. సాంకేతిక లోపంతో చెడిపోయిన ఆ హెలికాప్టర్ కదలక పోవడంతో ఈ పని చేశారు. ఆ హెలికాప్టర్‌ సముద్ర సమీపంలో ల్యాండ్ కావడంతో ఓ పెద్ద హెలికాప్టర్‌ను తీసుకొచ్చి కింద స్టాండ్‌కి పాడైపోయిన హెలికాప్టర్‌ను తాడుతో కట్టారు. అనంతరం అక్కడి నుంచి తీసుకెళ్లారు. మీరూ చూడండి... 
Go Back to Shorts
helicopter
Japan
video
viral

More Telugu News