roja: రోజాను పొలిటికల్ లీడర్ గా నేను పరిగణించను: కోట శ్రీనివాసరావు

  • నిర్మొహమాటం లేకుండా చెబుతున్నా
  • రోజా మాట్లాడే పద్ధతి నాకు నచ్చదు
  • బండ్ల గణేశ్ - రోజా పోట్లాడుకోవడం చూశాను
  • ఏంటా మాటలు?: ఓ ఇంటర్వ్యూలో కోట

వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజాపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నిర్మొహమాటంగా చెప్పాలంటే..రోజా గారిని పొలిటికల్ లీడర్ గా నేను పరిగణించను.. పట్టించుకోను. ఆమె మాట్లాడే పద్ధతి నాకు నచ్చదు.

ఎందుకంటే, ఈ మధ్య టీవీలో..బండ్ల గణేశ్, ఆ అమ్మాయి (రోజా) పోట్లాడుకోవడం చూశాను. ఏమిటా మాటలు? ఏమన్నా అర్థముందా? పోనీ, వాడంటే (బండ్ల గణేశ్) ఏదో కుర్ర వెధవ, పిచ్చోడిలా వాగాడు. నీ (రోజా) కేంటీ.. నువ్వు అనుభవజ్ఞురాలివి, ఎమ్మెల్యేగా చేశావు. ఆ అమ్మాయి గురించి నేనేమి వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు. బయటకు కనపడుతున్నది అది!’ అని అన్నారు.

More Telugu News