North India: ఉత్తరాది నగరాల్లో ల్యాండింగ్ వీలు లేక... శంషాబాద్ ఎయిర్ పోర్టుకు క్యూ కట్టిన విదేశీ విమానాలు!

  • ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు
  • కనీసం 25 మీటర్లు కూడా లేని విజబిలిటీ
  • పలు అంతర్జాతీయ విమానాలు దారి మళ్లింపు

ఉత్తర భారతావని మొత్తాన్ని ఈ ఉదయం పొగమంచు కమ్మేయడంతో, పలు అంతర్జాతీయ విమానాలు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు క్యూ కట్టాయి. ఢిల్లీ, లక్నో, చండీగఢ్ తదితర విమానాశ్రయాల్లో విజబిలిటీ కనీసం 25 మీటర్లు కూడా లేకపోవడంతో, ల్యాండింగ్ కు అనుమతించే పరిస్థితి కరవైంది. దీంతో సెంట్రల్ ఏటీసీ ఆదేశాల మేరకు ముంబై, హైదరాబాద్ నగరాలకు విమానాలు మళ్లాయి.

అయితే, ముంబై ఎయిర్ పోర్టు అత్యంత బిజీగా ఉండటంతో, పలు విమానాలు హైదరాబాద్ కు వచ్చాయి. దుబాయ్ - ఢిల్లీ - బంగ్లాదేశ్, సింగపూర్ - ఢిల్లీ, జెడ్డా - లక్నో, సౌదీ అరేబియా - ఢిల్లీ విమానాలు శంషాబాద్ లో ల్యాండ్ అయ్యాయి. మరికొన్ని విమానాలను కూడా హైదరాబాద్ కు మళ్లించినట్టు తెలుస్తోంది. ఉత్తరాదిలో పొగమంచు తగ్గిన తరువాత తిరిగి ఈ విమానాలు బయలుదేరుతాయని అధికారులు తెలిపారు.

More Telugu News