నిర్మాతగా కూడా నాని ప్లానింగ్ అదుర్స్ అట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిర్మాతగా కూడా నాని ప్లానింగ్ అదుర్స్ అట!

  • హీరోగా వరుస విజయాలు
  • 'అ!' సినిమాకి నిర్మాతగా
  • లాభాలు రావొచ్చనే అంచనా   
ఒక వైపున హీరోగా నాని వరుస సినిమాలతో .. వరుస సక్సెస్ లతో దూసుకుపోతూ, మరో వైపున నిర్మాతగాను అనుభవాన్ని సంపాదించేస్తున్నాడు. ఆయన నిర్మాతగా డిఫరెంట్ కంటెంట్ తో 'అ!' సినిమా రూపొందింది. కాజల్ .. రెజీనా .. నిత్యామీనన్ .. ఈషా రెబ్బా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా నుంచి, రీసెంట్ గా వచ్చిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.

హీరోగానే కాదు .. నిర్మాతగాను నాని అంతే ప్లానింగ్ తో వ్యవహరించాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. పరిమితమైన పాత్రలు గల కథను ఎంచుకుని, కాల్షీట్ల లెక్కన పారితోషికం మాట్లాడాడట. అలా ప్రమోషన్స్ తో కలుపుకుని, ఏడెనిమిది కోట్లలోపే సినిమాను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. ఓవర్సీస్ తో పాటు డిజిటల్ .. శాటిలైట్ రైట్స్ కలుపుకుని అయిదారు కోట్ల వరకూ రావొచ్చని చెబుతున్నారు. ఇక లోకల్ మార్కెట్ లో ఈ సినిమా ఎంత లేదన్నా 6 కోట్లకు తక్కువ పలకదనేది ట్రేడ్ వర్గాల అంచనా. విడుదలకి ముందే నానికి లాభాలు రావడం ఖాయమనేది వాళ్లు చెబుతోన్న మాట.        
Kajal Agarwal
regina

More Telugu News