priyanka chopra: పుస్తకరూపంలో ప్రియాంక చోప్రా జీవిత క‌థ!

  • ప్రియాంక ఎదుగుద‌ల గురించి మాత్ర‌మే వివ‌ర‌ణ‌
  • ప్రేమ వ్య‌వ‌హారాలు ముట్టుకోబోనంటున్న ర‌చ‌యిత‌
  • గ‌తంలో శ‌శిక‌పూర్ జీవిత‌క‌థ‌ను రాసిన అసీం

ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ జ‌ర్న‌లిస్ట్ అసీం చాబ్రా త్వ‌ర‌లో ప్రియాంక చోప్రా జీవితం ఆధారంగా ఓ పుస్త‌కం రాయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గ‌తంలో బాలీవుడ్ న‌టుడు శ‌శి క‌పూర్ జీవిత‌క‌థ‌ను `శ‌శి క‌పూర్: ద హౌస్‌హోల్డ‌ర్‌, ద స్టార్‌` అనే పుస్త‌క రూపంలో తీసుకువ‌చ్చారు. ఇప్పుడు తాను రాయ‌నున్న ప్రియాంక చోప్రా జీవిత‌క‌థ‌లో కేవ‌లం ఆమె ఎదుగుద‌ల గురించి మాత్ర‌మే వివ‌రించ‌నున్న‌ట్లు అసీం పేర్కొన్నారు.

ఓ చిన్న పట్ట‌ణానికి చెందిన బాలిక‌, అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మ‌హిళగా ఎలా ఎదిగింద‌న్న అంశాల‌ను ఈ పుస్తకంలో పొందుప‌రుస్తాన‌ని, అంతే త‌ప్ప ఆమె ప్రేమ వ్య‌వ‌హారాలు, వ్య‌క్తిగ‌త విష‌యాల జోలికి వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌ని ఆయ‌న వివ‌రించారు. 2018 చివ‌రిలోగా ఈ పుస్త‌కాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ పుస్త‌కానికి ఇంకా పేరు నిర్ణయించ‌లేదు.

More Telugu News