malware: బ్యాంకుల ఆండ్రాయిడ్ యాప్‌ల‌కు మాల్‌వేర్ బెడ‌ద‌.. రిస్కులో భార‌తీయ బ్యాంకులు?

  • వెల్ల‌డించిన యాంటీ వైర‌స్ సంస్థ క్విక్ హీల్‌
  • మాల్‌వేర్ పేరు ఆండ్రాయిడ్‌.బ్యాంక‌ర్‌.ఏ9480
  • క్రిప్టోక‌రెన్సీ యాప్‌ల‌కు కూడా త‌ప్ప‌ని ముప్పు

దాదాపు 232 బ్యాంకుల‌కు సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్‌ల మీద ఓ మాల్‌వేర్ దాడి చేసింద‌ని ప్ర‌ముఖ యాంటీ వైర‌స్ సంస్థ క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్‌ వెల్ల‌డించింది. వీటిలో భార‌తీయ బ్యాంకుల‌కు సంబంధించిన యాప్‌లు కూడా ఉన్నాయ‌ని పేర్కొంది. 'ఆండ్రాయిడ్‌.బ్యాంక‌ర్‌.ఏ9480' అనే ట్రోజ‌న్ మాల్‌వేర్ ఆండ్రాయిడ్ సిస్టంలో ప్ర‌వేశించి యూజ‌ర్‌నేమ్‌లు, పాస్‌వ‌ర్డుల‌ను త‌స్క‌రిస్తోంద‌ని క్విక్ హీల్ వెల్ల‌డించింది.

కేవ‌లం బ్యాంకింగ్ డేటా గురించి మాత్ర‌మే కాకుండా మెసేజ్‌లు, కాంటాక్టుల వివ‌రాల‌ను కూడా ఈ మాల్‌వేర్ వేరే స‌ర్వ‌ర్ల‌కు చేర‌వేస్తుంద‌ట‌. అలాగే క్రిప్టోక‌రెన్సీ యాప్‌ల‌పై కూడా ఈ మాల్‌వేర్ దాడి చేస్తోంద‌ని క్విక్ హీల్ చెప్పింది. ఈ మాల్‌వేర్ బారిన ప‌డిన బ్యాంకు యాప్‌ల జాబితాను కూడా క్విక్ హీల్ విడుద‌ల చేసింది. ఈ జాబితాలో యాక్సిస్ మొబైల్‌, హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ ఎనీవేర్ ప‌ర్స‌న‌ల్‌, ఐసీఐసీఐ వారి ఐమొబైల్‌, ఐడీబీఐ వారి గో మొబైల్‌, అభ‌య్‌, ఎం పాస్‌బుక్‌, బ‌రోడా బ్యాంక్, యూనియ‌న్ బ్యాంకుల యాప్‌లు కూడా ఉన్నాయి.

More Telugu News